newsseals.com

పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణ : భ‌ట్టి విక్ర‌మార్క

September 25, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల‌లో త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ప‌టిష్ట‌మైన , ఆదాయ వ‌న‌రులు ల‌భించేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు. ఇందుకు సంబంధించి అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తి , సౌక‌ర్యాలు క‌ల్పించేలా చూస్తామ‌న్నారు. అంతే కాకుండా భ‌విష్య‌త్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప‌ని చేస్తామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ప్రజాభవన్‌లో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక, సాంస్కృతిక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. మన రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యాన్ని విశ్వ వ్యాప్తం చేస్తూ ‘తెలంగాణ బ్రాండ్’ను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ద్వారా కొత్త ప్రాజెక్టులు చేపట్టి, స్థానిక యువతకు ఉపాధి కల్పన, ఆదాయ వనరుల పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు డిప్యూటీ సీఎం. టెంపుల్, ఎకో, హిల్ టూరిజం సర్క్యూట్ల అభివృద్ధి, రామప్ప వంటి చారిత్రక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల కోసం ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని స్ప‌ష్టం చేశారు.

Related News