newsseals.com

న‌టుడు ప్రియ‌ద‌ర్శిని ప్ర‌శంసించిన హ‌రీష్ రావు

October 1, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : తెలంగాణ‌కు చెందిన యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ది ప్యార‌డైజ్. సుధాక‌ర్ చెరుకూరి భారీ బ‌డ్జెట్ తో తీశాడు. స్టార్టింగ్ నెగ‌టివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు ఈ మూవీ రూ 200 కోట్ల క్ల‌బ్ లోకి చేరి పోయింది. సినీ ఇండ‌స్ట్రీ విస్తు పోయేలా చేసింది. తాజాగా ఈ మూవీలో మాజీ సీఎం కేసీఆర్ పాత్ర‌ను పోషించాడు న‌టుడు ప్రియ‌ద‌ర్శి. ఆయ‌న న‌టించిన ఈ పాత్ర‌కు ఫుల్ బ‌జ్ వ‌చ్చింది. సినిమా స‌క్సెస్ లో కూడా కీల‌క భూమిక వ‌హించింది. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పాత్ర‌కు న్యాయం చేసిన ప్రియ‌ద‌ర్శిని ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు. ఇదిలా ఉండ‌గా న‌టుడు ప్రియదర్శి హరీష్ రావు నివాసంలో గురువారం క‌లిశారు. తన సినీ ప్రయాణం , రాబోయే చిత్రాల గురించి చర్చించారు.

చంద్రశేఖర్ రావు హావభావాలు, నడక , మాట తీరును ప్రియదర్శి ఎంతో సహజంగా, ప్రభావవంతంగా ,ఆకట్టుకునేలా పోషించారని ఆయన కొనియాడారు. అస్తిత్వం ,ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటాల స్ఫూర్తిని ఈ చిత్రం సమర్థవంతంగా ఆవిష్కరించిందని హ‌రీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు న‌టుడు ప్రియదర్శి, ఆయన చేస్తున్న ప్రజా సేవ, ప్రజలతో ఆయనకున్న అనుబంధం పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. వారి సంభాషణలో, ‘మల్లేశం’, ‘బలగం’ వంటి చిత్రాల ద్వారా తెలంగాణ యాసను , గ్రామీణ నేపథ్య కథలను విస్తృత ప్రేక్షకులకు చేరవేసినందుకు హరీష్ రావు ప్రియదర్శిని అభినందించారు. సినీ నేపథ్యం లేకుండానే ఎదిగి రావడం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించడంలో ఆయన చేస్తున్న కృషి రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు.

Related News