newsseals.com

రజనీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో శ్రీలీల..?

October 1, 2026 · VijayaBhaskar

చెన్నై : ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల వార్త‌ల్లో నిలిచారు. తాజాగా త‌ను త‌లైవా న‌టిస్తున్న మూవీలో భాగం కానున్నారు. ఇందుకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న రాబోయే తమిళ చిత్రం ‘ధర్మన్’లో శ్రీలీల భాగం కానున్నట్లు సమాచారం. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ నిర్మిస్తోంది .రజనీకాంత్‌తో కలిసి నటించే గొప్ప అవకాశం శ్రీలీలకు లభించనుండటంతో అభిమానుల్లో ఈ వార్త ఆసక్తిని మ‌రింత‌ రేకెత్తించింది. అయితే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తను కేవలం ఒక తాజా సమాచారంగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది.

ఈ చిత్రంలో సిమ్రాన్ తో పాటు కామెడీ కింగ్ యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తుండగా, రాశీ ఖన్నా కూడా నటీనటుల జాబితాలో ఉన్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2027 పొంగల్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ నిర్మాణ దశలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

Related News