ఉప ఎన్నికల్లో టీవీకే విజయం ఖాయం
చెన్నై : ప్రస్తుతం రాష్ట్రంలో జరగబోయే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో టీవీకే కూటమి అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు మంత్రి ఎన్. రవికుమార్. డీఎంకే తమిళనాడు రాజకీయాల్లోకి పునరాగమనం చేయడానికి ప్రయత్నిస్తుండగా ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. మధురాంతగం , ధారపురం ఉప ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) భారీ విజయం సాధిస్తుందని, ఇది సంకీర్ణ ప్రభుత్వానికి , దాని సంక్షేమ పథకాలకు గుర్తింపు అవుతుందని ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్ జోస్యం చెప్పారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
రెండు ద్రవిడ పార్టీలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయని పేర్కొన్నారు. అందుకే ఎన్నికల్లో టీవీకేను సవాలు చేయలేక పోయాయని ఆయన అన్నారు. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడం గురించి అడిగినప్పుడు, ఒక పార్టీలో చేరడం అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత కోరిక అని ఆయన అన్నారు. వారికి ఏఐఏడీఎంకే విధానాలు, నాయకత్వం నచ్చలేదని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలవదని కూడా వారు గ్రహించారని చెప్పారు. ఏఐఏడీఎంకేను విడిచిపెట్టిన ఎమ్మెల్యేలు, గమ్యాన్ని చేరని ఏఐఏడీఎంకేలో తాము ప్రయాణించగలమని భావించారని అన్నారు. డీఎంకే కూటమికి తిరిగి వెళ్లే అవకాశం లేదని చెబుతూ, భవిష్యత్తులో డీఎంకేలో చేరడాన్ని ఆయన తోసిపుచ్చారు.