newsseals.com

నాగర్‌కర్నూల్, వికారాబాద్ ల‌లో కేంద్రీకృత వంట‌శాల‌లు

October 2, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : జున్నా సోలార్ సిస్టమ్స్ , చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి. శుక్ర‌వారం జూబ్లీ హిల్స్‌లోని త‌న‌ నివాసంలో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు స‌మావేశం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దేశించిన అల్పాహార కార్యక్రమాన్ని సమీక్షించారు సీఎం. ఇదిలా ఉండ‌గా నాగర్‌కర్నూల్ , వికారాబాద్‌లలో కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావ‌డం ప‌ట్ల‌ జున్నా సోలార్ సిస్టమ్స్ , చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలకు ప్ర‌త్య‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు రేవంత్ రెడ్డి.

ఈ వంటశాలలను నవంబర్ 30 లోగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అంతే కాకుండా డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించాలని స్ప‌ష్టం చేశారు. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదని అన్నారు. ఇది మన పిల్లల భవిష్యత్తులో ఒక పెట్టుబడి అని పేర్కొన్నారు సీఎం. ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నాణ్యమైన ఆహారం, మంచి ఆరోగ్యం , మెరుగైన విద్యతో ఉన్నత స్థాయికి ఎదగాలన్నది మా సంకల్పం అని ఈ సంద‌ర్బంగా స్ప‌ష్టం చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. త‌మ తొలి ప్రాధాన్య‌త విద్య‌, వైద్యం, ఉపాది అని పేర్కొన్నారు అనుముల రేవంత్ రెడ్డి.

Related News