ఓరుగల్లు ఎయిర్ పోర్టుకు జయశంకర్ పేరు పెట్టాలి
హైదరాబాద్ : తెలంగాణ విశ్లేషకుడు వి. ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వరంగల్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎవరి పేరు పెట్టాలనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కొందరు కాకతీయ రాజుల పేరు పెట్టాలని ప్రతిపాదిస్తే మరికొందరు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై. రోజుకో మాట మాట్లాడుతూ తన సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇస్తూ ఇతర సామాజిక వర్గాలను కించ పరుస్తుండడం పట్ల బహజనులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు మండి పడుతున్నారు.
ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వి. ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓరుగల్లు (వరంగల్ ) లో ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్టుకు కాకతీయ రాజుల పేర్లు పెట్టవద్దని ఒకవేళ అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కాకతీయ రాజులైన రాణి రుద్రమదేవి, గణపతిదేవుల పేర్లు పెట్టాల్సిన అవసరం లేనే లేదన్నారు. ఇప్పటికే చాలా వాటికి వాళ్ల పేర్లు ఉన్నాయని, కొత్తగా వాళ్లకు గుర్తింపు అవసరం లేదన్నారు. ఆదివాసీలైన సమ్మక్క, సారక్కలను హతమార్చింది కాకతీయ రాజులేనని ఆ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమానికి ఊపిరి పోసిన దివంగత తెలంగాణ గాంధీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు వి. ప్రకాష్.