ఎల్ నినో ఎఫెక్ట్ ఉపాధిపై స‌ర్కార్ ఫోక‌స్

హైద‌రాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టిన తరుణంలో, గ్రామీణ కూలీలకు ప్రత్యామ్నాయంగా ఉపాధి హామీ పనులను విస్తృతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. గత ఏళ్లతో పోలిస్తే అక్టోబర్ నెలలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిన్న‌ 2,54,812 మంది కూలీలు పనికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఈ పథకం అమలు ప్రారంభమైనప్పటి నుండి నమోదైన కూలీలలో అత్యధిక రోజువారీ హాజరు ఇదే కావడం విశేషం. గత ఐదేళ్లలో అక్టోబర్ నెలలో పని కోరే వారి సగటు సంఖ్యను పరిశీలిస్తే ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. అక్టోబర్ 2025లో రోజుకు సగటున 24,750 మంది మాత్రమే ఉపాధి హామీ పనులకు హాజరుకాగా, అక్టోబర్ 2026 నాటికి ఈ సంఖ్య 2.16 లక్షలకు చేరింది. అంటే, గత ఏడాదితో పోలిస్తే పని కోరే వారి సగటు సంఖ్య గణనీయంగా పెరిగింది.

‘ఎల్ నినో’ కారణంగా వ్యవసాయ పనులు తగ్గుతున్న తరుణంలో, గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భద్రత కల్పించేందుకు ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు; అలాగే ఆమె జిల్లా అధికారులతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పని కోరే ప్రతి కుటుంబానికి వీలైనంత త్వరగా పని కల్పించాలని, పని కోరే వారి సంఖ్యను మరింత పెంచేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని మంత్రి సూచిస్తున్నారు. ఉపాధి హామీ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే జాబ్ కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పని కోరే కూలీలను గుర్తించి, అందుబాటులో ఉన్న పనుల వివరాలను వారికి తెలియ జేయాలని, అలాగే ఎక్కువ మంది కూలీలు పనుల్లో పాల్గొనేలా కృషి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

  • Related Posts

    ఉపాధ్యాయులు సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి

    జోగులాంబ గ‌ద్వాల జిల్లా : మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలను మెరుగు పరచుకుంటూ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా విద్యాశాఖ జ్ఞాన దీప్తి కార్యక్రమం ఆధ్వర్యంలో బుధవారం గోనుపాడు గ్రామంలోని…

    పెట్టుబ‌డుల‌కు తెలంగాణ గ‌మ్య‌స్థానం కావాలి : సీఎస్

    హైద‌రాబాద్ : తెలంగాణ పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానం కావాల‌ని అన్నారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు. బుధ‌వారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇన్వెస్ట్ తెలంగాణ మొదటి పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. తెలంగాణ పెట్టుబడి వ్యవస్థను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *