అన్న‌ప్ర‌సాద సేవ‌లో శ్రీ‌వారి సేవ‌కులు

తిరుమ‌ల : టీటీడీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి రోజూ 3 ల‌క్ష‌ల మందికి పైగా శ్రీ‌వారి అన్న ప్ర‌సాదాన్ని స్వీక‌రిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంద‌లాది మంది శ్రీవారి సేవ‌కులు సేవ‌లు అందిస్తున్నారు. స్వామి వారి ప్ర‌సాదాన్ని స్వీకించేందుకు సాయం చేస్తున్నారు. త‌మ వంతు సేవ‌లో భాగం అవుతున్నారు. “అన్నదానం మహాదానం” అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద కార్యక్రమం భక్తుల సేవలో ఒక మహత్తర ఆధ్యాత్మిక సేవగా నిలుస్తోంది లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా అన్నప్రసాదాన్ని అందించేందుకు సుమారు వెయ్యి మందికి పైగా అన్నప్రసాద విభాగం సిబ్బంది, మరో వెయ్యి మందికి పైగా శ్రీవారి సేవకులు నిరంతరం సేవలందిస్తున్నారు.

ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు, క్యూలైన్లలోని భక్తుల నుంచి వసతి సముదాయాల్లోని యాత్రికుల వరకు ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా సమన్వయంతో పని చేస్తున్నారు .శ్రీవారి సన్నిధికి వచ్చే ప్రతి భక్తుడు కడుపు నిండా భోజనం చేసి తృప్తిగా స్వామి వారి దర్శనం చేసుకోవాలన్న సంకల్పంతో టీటీడీ కొనసాగిస్తున్న ఈ అన్నప్రసాద సేవ తిరుమలను నిజమైన “అన్నపూర్ణ నిలయం”గా నిలబెడుతోంది. శ్రీవారి క్షేత్రంలో ఆకలితో వచ్చే భక్తుడికి అన్నం అందించడం కేవలం సేవ మాత్రమే కాదు—భక్తుడిలో భగవంతుడిని చూసే భారతీయ సనాతన సంప్రదాయానికి ప్రత్యక్ష ప్రతిరూపం.

  • Related Posts

    అప్ప‌లాయ‌గుంట ఆల‌యంలో ఘ‌నంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ

    తిరుపతి : అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు.…

    రూ.71 లక్షలతో ఈ–లెర్నింగ్ సెమినార్ హాల్

    తిరుప‌తి : శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో రూ.71 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ-లెర్నింగ్ సెమినార్ హాల్‌ను టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రారంభించారు. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థినులకు ఈ సెమినార్ హాల్ ఎంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *