రూ.71 లక్షలతో ఈ–లెర్నింగ్ సెమినార్ హాల్

తిరుప‌తి : శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో రూ.71 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ-లెర్నింగ్ సెమినార్ హాల్‌ను టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రారంభించారు. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థినులకు ఈ సెమినార్ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.అనంతరం విద్యార్థి సంఘాన్ని ప్రారంభించి, నూతనంగా ఎన్నికైన విద్యార్థి ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యార్థి సంఘ ప్రతినిధులు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు.

అంతకు ముందు కళాశాలలో నిర్వహిస్తున్న పాఠ్య, సహ పాఠ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను ప్రిన్సిపాల్ డా. సి. భువనేశ్వరిని అడిగి తెలుసుకుని పరిశీలించారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు .ఈ సందర్భంగా టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో ప్రభల గోపినాథ్, సీఈ మనోహరం, ఇన్‌చార్జి డీఈవో డా. ఏ.వి.ఎన్. శివకుమార్, ఎన్‌ఈ డి. నరసింహ మూర్తిలను కళాశాల ప్రిన్సిపాల్ , సిబ్బంది సన్మానించి, శ్రీవారి జ్ఞాపికలను అందజేశారు. అంత‌కు ముందు విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, టిటిడి అధికారులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

  • Related Posts

    అప్ప‌లాయ‌గుంట ఆల‌యంలో ఘ‌నంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ

    తిరుపతి : అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు.…

    అన్న‌ప్ర‌సాద సేవ‌లో శ్రీ‌వారి సేవ‌కులు

    తిరుమ‌ల : టీటీడీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి రోజూ 3 ల‌క్ష‌ల మందికి పైగా శ్రీ‌వారి అన్న ప్ర‌సాదాన్ని స్వీక‌రిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంద‌లాది మంది శ్రీవారి సేవ‌కులు సేవ‌లు అందిస్తున్నారు. స్వామి వారి ప్ర‌సాదాన్ని స్వీకించేందుకు సాయం చేస్తున్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *