తిరుమల గోశాలలో ఏర్పాట్ల పరిశీలన : ఏఈవో చౌద‌రి

తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి టీటీడీ చేపడుతున్న ఏర్పాట్లలో భాగంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలోని గోశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గోశాలలోని గోవుల సంరక్షణ, పశువుల ఆరోగ్య పరిస్థితులు, పాల ఉత్పత్తి సామర్థ్యం, పశుగ్రాసం నిల్వలు, ఇతర అవసరాలపై అధికారులతో సమీక్షించారు.బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల గోశాలలో ప్రస్తుతం సుమారు 100 గోవులు ఉన్నాయని, రోజుకు దాదాపు 90 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. శ్రీవారి కైంకర్యాలకు గోశాల నుంచి సేకరించిన పాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతిరోజూ నిర్వహించే నవనీత సేవకు అవసరమైన సుమారు 1.5 కిలోల వెన్నను కూడా గోశాల నుంచే సమకూర్చుతున్నట్లు వివరించారు. నవనీత సేవకు సంబంధించిన ఊరేగింపు కూడా గోశాల నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే ఏనుగులు, గుర్రాలు, ఎద్దుల సంరక్షణ, వాటి ఆరోగ్య పరిస్థితులు, ఉత్సవాల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, సన్నద్ధతను కూడా పరిశీలించారు .జంతువుల సంరక్షణలో సిబ్బందికి ఉన్న అనుభవాన్ని, వాటి ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. జంతువులకు అవసరమైన వైద్య సదుపాయాలు, వెటర్నరీ నిపుణుల సేవలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. గోవులకు అవసరమైన పశుగ్రాసం, ఇతర వసతులను పటిష్ఠంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు.

  • Related Posts

    అప్ప‌లాయ‌గుంట ఆల‌యంలో ఘ‌నంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ

    తిరుపతి : అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు.…

    అన్న‌ప్ర‌సాద సేవ‌లో శ్రీ‌వారి సేవ‌కులు

    తిరుమ‌ల : టీటీడీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి రోజూ 3 ల‌క్ష‌ల మందికి పైగా శ్రీ‌వారి అన్న ప్ర‌సాదాన్ని స్వీక‌రిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంద‌లాది మంది శ్రీవారి సేవ‌కులు సేవ‌లు అందిస్తున్నారు. స్వామి వారి ప్ర‌సాదాన్ని స్వీకించేందుకు సాయం చేస్తున్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *