స్టార్ లింక్ స‌మ‌స్య‌పై స్పందించిన పెమ్మసాని

న్యూఢిల్లీ : భార‌త దేశంలో తాను స్థాపించిన స్టార్ లింక్ సేవ‌లు కొన‌సాగించ‌కుండా కొన్ని శ‌క్తులు అడ్డుకుంటున్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు స్టార్ లింక్ అధిప‌తి, ఎక్స్ సీఈఓ ఎలాన్ మ‌స్క్. ఆయ‌న తాజాగా త‌న సామాజిక వేదిక ఎక్స్ వేదిక‌గా ఈ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇది భార‌త దేశ ప్ర‌భుత్వ ప‌నితీరు ప‌ట్ల కొంత వ్య‌తిరేక‌త కూడా వ్య‌క్త‌మైంది. దీనిపై కేంద్ర టెలిక‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఇవాళ స్పందించారు. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు.

స్టార్‌లింక్‌పై ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మా వరకు చూస్తే తాత్కాలిక‌ స్పెక్ట్రమ్ అందించడంలో రవాణా శాఖ (DoT) దృక్కోణం నుండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ హోం మంత్రిత్వ శాఖ (MHA) జాతీయ ప్రయోజనాలను అన్ని కోణాల నుండి పరిశీలించి లైసెన్స్ మంజూరు చేస్తుందని చెప్పారు. ఇది కేవలం ఒక శాటిలైట్ కంపెనీకి సంబంధించిన విషయం కాదని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఇది అన్ని శాటిలైట్ కంపెనీలకు, వాటి వల్ల కలిగే నష్టాలు , ప్రయోజనాలకు సంబంధించినది అని స్ప‌ష్టం చేశారు.

ఇక రాహుల్ గాంధీ విషయానికొస్తే ఆయనకు సరిగ్గా ఏమి కావాలో దానిపై ఆయనే స్పష్టతతో ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో లేనందున, ప్రపంచ వ్యాప్తంగా ఏమి జరుగుతుందో అనే సమగ్ర సమాచారం ఆయనకు అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు ఏ దేశాన్ని చూసినా, అన్ని దేశాలు సార్వభౌమమైనవే. అవి తమ నిర్ణయాలు తాము తీసుకోగలవు. అదే విధంగా, భారతదేశంలో మనం అన్ని కోణాల నుండి ఆలోచిస్తామని చెప్పారు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    దాడులు, అరెస్ట్ లకు భ‌య‌ప‌డేది లేదు : నేహా బోరా

    న్యూఢిల్లీ : ఎన్ని దాడుల‌కు పాల్ప‌డినా, అరెస్టులు చేసినా తాము వెన‌క్కి వెళ్లే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌క‌టించారు ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త‌, ఏఐఎస్ఎఫ్ నాయ‌కురాలు నేహా బోరా. శ‌నివారం సీజేపీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని…

    ఎలాన్ మ‌స్క్ కు జోహో ఫౌండ‌ర్ స్ట్రాంగ్ కౌంట‌ర్

    చెన్నై : స్టార్‌లింక్ వివాదం మధ్య అంబానీపై ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు జోహో ఫౌండ‌ర్ శ్రీధర్ వేంబు కౌంటర్ ఇచ్చారు. జియో మొబైల్ డేటాను అందిస్తుందని వేంబు పేర్కొన్నారు. అలాగే, భారత టెలికాం మార్కెట్‌పై ఎలాన్ మస్క్ చేసిన విమర్శలను కూడా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *