Tuesday, 13 October 2026

ఆధ్యాత్మికతతో పాటు ఉపాధి, పర్యాటకానికి ప్రాధాన్యం

newsseals-APCM

తిరుమ‌ల : తిరుపతిని వివాహ వేడుకలు, అంతర్జాతీయ సదస్సులు, క్రీడలకు అనువైన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్‌ హాల్‌ ఏర్పాటు, క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ, ఏసీఏ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతి ఆధ్యాత్మికతతో పాటు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక సౌకర్యాల విషయంలో ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యాలు, టీటీడీ ఉద్యోగుల సంక్షేమం, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమన్వయం చేస్తూ తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఈవో ఎం. రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. ఎ. శరత్‌, గోపినాథ్‌, పాలకమండలి సభ్యులు పనబాక లక్ష్మీ, జ్యోతుల నెహ్రూ, జి. భానుప్రకాష్ రెడ్డి, శ్రీ శాంతారాం, తుడా ఛైర్మన్ , టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, తుడా అధికారులు, టిటిడి అధికారులు, టిటిడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *