newsseals.com

మేయ‌ర్ స్థానాల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

October 13, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్ స్థానాల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మేయర్ స్థానాల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్థానం కేటాయించారు. జనరల్ మహిళలకు 5 స్థానాలు, అర్రిజర్వ్ కేటగిరీకి 4 స్థానాలు కేటాయించారు. రిజర్వేషన్ల వివరాల ప్రకారం మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేష‌న్ ను ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. కర్నూలు మేయర్ స్థానం ఎస్సీ మహిళకు, రాజమండ్రి మేయర్ స్థానం ఎస్సీ జనరల్ కేటగిరీకి కేటాయించారు.

దీంతో ఎస్సీలకు కేటాయించిన రెండు స్థానాల్లో ఒకటి మహిళకు, మరొకటి జనరల్ కేటగిరీకి దక్కింది. బీసీలకు మొత్తం ఐదు మేయర్ స్థానాలు కేటాయించారు. వీటిలో ఏలూరు, అనంతపురం, చిత్తూరు మేయర్ స్థానాలను బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించగా, కాకినాడ, మచిలీపట్నం స్థానాలను బీసీ మహిళలకు కేటాయించారు. జనరల్ మహిళల కేటగిరీలో విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప మేయర్ స్థానాలు ఉన్నాయి. అన్ రిజ‌ర్వ్ కేటగిరీలో తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ స్థానాలను కేటాయించారు. ఇప్ప‌టికే టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బీసీల‌కు ప్ర‌యారిటీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Related News