Monday, 12 October 2026

‘అమ్ర‌పాలి’కి మ‌ళ్లీ ప‌ర్యాట‌క శాఖ‌లో పోస్టింగ్

newsseals-AmrapaliKata

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లువురు ఐఏఎస్ ల‌కు స్థాన చ‌ల‌నం క‌ల్పించింది. గ‌తంలో ఎలాంటి రిపోర్టు చేయ‌కుండానే ఉండిపోయిన అధికారిణి అమ్ర‌పాలి కాట‌కు తిరిగి ఏపీ ప‌ర్యాట‌క శాఖ‌లో పోస్టింగ్ ల‌భించింది. ఆమెను పర్యాటక , సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించారు.APTDC ఎండీగా పనిచేస్తున్న సమయంలో ఆమె సెలవుపై వెళ్లారు. సెలవు గడువు ముగిసినా తిరిగి విధుల్లో చేరక పోవడంతో, ఆమెను ‘పోస్టింగ్ లేకుండా’ బదిలీ చేశారు. తాజాగా ఆమె తిరిగి విధుల్లో చేరడంతో, ఇప్పుడు ఆమెకు కొత్త పోస్టింగ్ కేటాయించారు. గ‌తంలో అమ్ర‌పాలి ప‌లు ప‌ద‌వులు నిర్వ‌హించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ గా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)లో జాయింట్ కమిషనర్ , వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ , ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో డిప్యూటీ సెక్రటరీగా ప‌ని చేశారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇక అమ్రపాలి కటా భారతీయ పరిపాలనా సేవ (IAS)లో 2010 బ్యాచ్‌కు చెందిన అధికారి. విశాఖపట్నంలో జన్మించిన ఆమె, ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్‌, ఐఐఎం బెంగళూరులో మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత సివిల్‌ సర్వీసెస్‌లోకి ప్రవేశించారు. తెలంగాణలో జిల్లా స్థాయి పరిపాలన నుంచి హైదరాబాద్‌ నగర పాలన వరకు, కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి కార్యాలయం వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారు. న‌వంబ‌ర్ 4,, 1982లో విశాఖ‌ప‌ట్నంలో పుట్టారు. తండ్రి కటా వెంకట్ రెడ్డి .ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె సివిల్ సర్వీసెస్‌లోకి రాక ముందు ABN AMRO బ్యాంకులో పని చేసినట్లు స‌మాచారం. 2010లో నిర్వహించిన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆమ్రపాలి కటా 39వ ర్యాంకు సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *