ముంబై : 57వ IFFIలో ‘ఇండియన్ పనోరమా’ ఫీచర్ ఫిల్మ్ విభాగం జ్యూరీ చైర్మన్‌గా మధుర్ భండార్కర్ ను నియమించారు. ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ చైర్మన్‌గా, అర్హమైన చిత్రాలను పరిశీలించి,57వ IFFIలో ప్రదర్శించడానికి 25 అత్యుత్తమ ఫీచర్ చిత్రాలను సిఫార్సు చేసే బాధ్యత ఆయనపై ఉంటుంది. ఈ ఎంపికలో నిర్దేశిత చలనచిత్ర వాణిజ్య సంస్థలు సిఫార్సు చేసిన ప్రధాన స్రవంతి సినిమాకు చెందిన ఐదు చిత్రాలు కూడా ఉంటాయి. ‘చాందినీ బార్’, ‘పేజ్ 3’, ‘ఫ్యాషన్’, ‘బబ్లీ బౌన్సర్’ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు సినీ దర్శకుడు మధుర్ భండార్కర్. రాబోయే 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI) 2026లో ‘ఇండియన్ పనోరమా’ ఫీచర్ ఫిల్మ్ విభాగం జ్యూరీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ ఉత్సవంలో ప్రధానంగా ‘అంతర్జాతీయ సినిమాస , ‘ఇండియన్ పనోరమా’ అనే రెండు ముఖ్యమైన విభాగాలు ఉంటాయి.
‘ఇండియన్ పనోరమా’ అనేది సమకాలీన భారతీయ సినిమాలోని అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శించడానికి , చలనచిత్ర నిర్మాణంలో నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక ప్రధాన విభాగం. 57వ IFFI ఫెస్టివల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. భారత ప్రభుత్వ సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాలను వేడుకగా జరుపుకుంటోంది. ఎంపిక చేసిన చిత్రాల నుండి జ్యూరీ ప్రధాన పోటీ విభాగం కోసం మూడు చిత్రాలను, దర్శకుని ఉత్తమ తొలి చిత్రం విభాగం కోసం రెండు చిత్రాలను, అంతర్జాతీయ పోటీ విభాగంలో ‘ICFT UNESCO-గాంధీ మెడల్’ కోసం మూడు చిత్రాలను సిఫార్సు చేస్తుంది.
భారతీయ ఫీచర్ చిత్రానికి సంబంధించి ‘ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు’ అవార్డు కోసం వచ్చిన ఎంట్రీలను కూడా జ్యూరీ పరిశీలించి, ఐదు చిత్రాలను సిఫార్సు చేయడంతో పాటు విజేతను ఎంపిక చేస్తుంది. అర్హత కలిగిన ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీల ప్రాథమిక జ్యూరీ పరిశీలన సెప్టెంబర్ 29న ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది . ఇది అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. దీని తర్వాత ఎంపిక చేసిన 60 ఫీచర్ ఫిల్మ్‌ల పరిశీలన ప్రక్రియ ముంబైలోని NFDC ఆడిటోరియంలో అక్టోబర్ 18 నుండి నవంబర్ 1, 2026 వరకు కేంద్ర జ్యూరీ ప్యానెల్ ఆధ్వర్యంలో జరుగుతుంది




