newsseals.com

కనకదుర్గమ్మకు ద్వారకాతిరుమల శ్రీవారి సారె సమర్పణ

October 13, 2026 · VijayaBhaskar

విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పవిత్ర వేళ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం తరఫున సారె తీసుకువచ్చారు. శ్రీవారి క్షేత్రం నుంచి జగన్మాతకు సారె సమర్పించడం రెండు పుణ్యక్షేత్రాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధాన్ని, భక్తి సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పే విశేషంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్ సూరనేని వెంకట నివృతరావు సహా సిబ్బంది h సిబ్బంది దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. శరన్నవరాత్రుల వేళ జగన్మాతకు సారె సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ భక్తి సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చారు.

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక కానుకలు, సంప్రదాయ సమర్పణలు ఉత్సవ వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నాయి. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ, ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యానుగ్రహం సమస్త ప్రజలపై ఉండాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.

Related News