Thursday, 15 October 2026

విశాఖ‌లో చిరంజీవి సినిమా థియేట‌ర్ ఏర్పాటు

newsseals-Chiranjeevi

హైద‌రాబాద్ : ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా థియేట‌ర్ ఏర్పాటు చేయ‌నున్నారా . అవున‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది సినీ ఇండ‌స్ట్రీలో. టీడీపీకి చెందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చిరంజీవితో మంచి సాన్నిహిత్యం ఉంది. మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఫిల్మ్ ఎగ్జిబిషన్ (సినిమా ప్రదర్శన) రంగంలోకి అడుగు పెడుతున్నారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌ను తీసుకు వచ్చేందుకు ఆయన ‘ఏషియన్ సినిమాస్’తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కూడా ఒక కొత్త మల్టీస్క్రీన్ థియేటర్‌ను నిర్మించాలని మెగాస్టార్ యోచిస్తున్నారు.

‘గరివిడి లక్ష్మి’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. గంటా శ్రీనివాసరావుకు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. ఇటీవల మంత్రి మెగాస్టార్‌ను కలిసినప్పుడు, ఆయన ఈ కొత్త మల్టీప్లెక్స్ గురించి స్వయంగా వెల్లడించారు. దీనితో హైదరాబాద్, విశాఖపట్నాలలో సొంత థియేటర్లు కలిగిన మహేష్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్ ,విజయ్ దేవరకొండ వంటి నటుల సరసన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. దీంతో మెగాస్టార్ అభిమానులు పెద్ద ఎత్తున చిరంజీవి తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *