Thursday, 15 October 2026

పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి స‌న్నిధిలో ర‌ష్మిక మంద‌న్న‌

newsseals-RashmikaMandhaanna

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న తొలిసారిగా త‌న భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించిన చిత్రం ర‌ణ‌బాలి అక్టోబ‌ర్ 16న శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌మోష‌న్స్ ప్రారంభించారు ఇప్ప‌టికే చిత్ర బృందం. ఇందులో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సి ఉంది. గ‌తంలో త‌ను చిన్న‌ప్పుడు ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌వేత్త పుట్ట‌ప‌ర్తి విశ్వ విద్యాల‌యంలో చ‌దువుకున్నాడు. త‌న‌కు ఎప్పుడు వీలు క‌లిగినా పుట్ట‌ప‌ర్తికి చేరుకుంటాడు. అక్క‌డ స‌త్య‌సాయి బాబ‌ను ద‌ర్శించుకుంటాడు. తాజాగా త‌న స‌తీమ‌ణి , న‌టి ర‌ష్మిక మంద‌న్న‌తో క‌లిసి పుట్ట‌ప‌ర్తిని సంద‌ర్శించారు గురువారం.

ఇక ర‌ష్మిక మంద‌న్న న‌టించిన తాజా చిత్రం రణ‌బాలిపై అంచ‌నాలు పెరిగాయి. దీనిని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది భారీ బ‌డ్జెట్ తో. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం రాహుల్ సాంకృత్య‌న్. ఇక ర‌ష్మిక మంద‌న్నా విజ‌య్ క‌లిసి గ‌తంలో న‌టించారు. గీత గోవిందం మూవీలో కీ రోల్స్ పోషించారు. ఈ సినిమా బిగ్ స‌క్సెస్ అయ్యింది. భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ సినిమా షూటింగ్ లో ఇద్ద‌రూ ప్రేమ‌లో పడ్డారు. ఆ త‌ర్వాత చాలా గ్యాప్ త‌ర్వాత ఈ ఇద్ద‌రూ క‌లిసి తాజాగా ర‌ణ‌బాలిలో న‌టించారు. ఈ సినిమా ట్రైల‌ర్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. రష్మిక మందన్న భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ నటిగా వెలుగొందుతోంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. క‌ర్ణాట‌క‌లోని విరాజ్ పేట స్వ‌స్థ‌లం. ఏప్రిల్ 5, 1996లో పుట్టింది ఈ ముద్దుగుమ్మ‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *