Saturday, 17 October 2026

ధ‌నుష్ కు అన్నాడీఎంకే బంప‌ర్ ఆఫ‌ర్

newsseals-AIADMK

చెన్నై : త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. సినీ రంగానికి చెందిన స్టార్ హీరో జోసెఫ్ విజ‌య్ సీఎం కావ‌డంతో ఇత‌ర సినీ న‌టులు త‌మ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. తాజాగా ధ‌నుష్ కూడా రాజ‌కీయాల‌లోకి రావాల‌ని అనుకుంటున్న‌ట్లు భారీ ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో మాజీ మంత్రి, అన్నాడీఎంకేకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు బాలాజీ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌ను వ‌స్తానంటే తాము క‌చ్చితంగా ఎర్ర తివాచీ ప‌రుస్తామ‌ని ప్ర‌క‌టించాడు. సోషల్ మీడియాలో ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శివకాశిలో శ‌నివారం విలేకరులతో మాట్లాడారు . ధనుష్ ఒక ప్రముఖ నటుడని, యువతలో ఆయనకు మంచి పట్టు ఉందని అభివర్ణించారు. పార్టీని బలోపేతం చేయడానికి, దాని లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడే ఎవరినైనా తమ పార్టీ ఆహ్వానిస్తుందని ఆయన చెప్పారు.

ధనుష్ ఏఐఏడీఎంకేలో చేరితే తాము అతడిని రెండు చేతులతో ఆహ్వానిస్తాం అని మాజీ మంత్రి పేర్కొన్నారు. ధనుష్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారని, ‘తమిళనాడు ఉచ్చి కళగం’ అనే పేరుతో ఎన్నికల సంఘం వద్ద ఒక పార్టీని నమోదు చేయించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. మరోవైపు, అక్టోబర్ 15న ధనుష్ అభిమాన సంఘాల సమావేశం జరిగిందని, అందులో వారి భవిష్యత్తు కార్యకలాపాలపై చర్చించారని సమాచారం. ఈ అభిమాన సంఘాలు ఒక స్వచ్ఛంద సంస్థగా పని చేస్తాయని, వీటికి ప్రత్యేక జెండా , చిహ్నం కూడా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలు ధనుష్ రాజకీయ ప్రణాళికల గురించి జరుగుతున్న ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *