అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై. గొడ్డలి పార్టీ అక్రమాలు, అరచాకాలపై ప్రెస్ కాన్ఫరెన్సులో వీడియోలు ప్రదర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికల్లో గొడ్డలి పార్టీ నేతల అరాచకాల గురించి ఏకరవు పెట్టారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ , నేతల వ్యవహారశైలిపై మండిపడ్డారు. ఆనాడు వైసీపీ అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేయించుకున్న విధానాన్ని మీడియా సమావేశంలో వివరించారు. అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంటే… గొడ్డలి పార్టీ ఇప్పటికీ వినాశనానికే పని చేస్తోందని ఆరోపించారు. రాజకీయాలే ప్రజల తలరాతలు మారుస్తాయని, మంచి నేతలను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బెంగళూరు నుంచి వచ్చాడు.3 గంటల పాటు ప్రెస్మీట్ పెట్టాడు. ఎస్ఈసీని కలిశాడు.ఎస్ఈసీ వద్ద ఆయన ప్రవర్తన ఏంటీ..? ఎస్ఈసీ వద్దకు వెళ్లి సొంత ఛానెళ్లను తీసుకెళ్లి లైవ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎస్ఈసీ తనకు రక్షణ కల్పించి కాపాడాలని కేంద్రానికి లేఖ రాసే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు. నాడు స్థానిక ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని అప్పటి ఎస్ఈసీ చెబితే.. ఆయన్ను తప్పు పట్టారు గత ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాల్లో 24 శాతం, జెడ్పీటీసీ స్థానాల్లో 19 శాతం ఏకగ్రీవం అయ్యాయని అన్నారు. దీనికి ఏం సమాధానం చెబుతాడో చూడాలన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేస్తున్నాడని ఆరోపించారు.




