Monday, 2 November 2026

పున‌రుత్పాద‌క ఇంధ‌నంపై భార‌త్ ఫోక‌స్ : మోదీ

newsseals-PMModi

న్యూఢిల్లీ : భార‌త దేశం పున‌రుత్పాద‌క ఇంధ‌నంపై ఎక్కువ‌గా దృష్టి సారిస్తోంద‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. సోమ‌వారం ఢిల్లీలో ‘భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు – ఎక్స్‌పో 2026’ను ప్రారంభించారు. ‘భారత్ మండపం’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించి, సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. నవంబర్ 2 నుండి 5 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్త విధానకర్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు , పరిశ్రమల నాయకులు పాల్గొన‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు పీఎం. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలు , అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని స్ప‌ష్టం చేశారు . ఈ సదస్సు యొక్క ఇతివృత్తం (థీమ్) ‘పెట్టుబడి పెట్టండి. ఆవిష్కరించండి. స్ఫూర్తినివ్వండి’ అని నిర్ణయించడం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు.

‘భారత్ RE 2026’లో 130కి పైగా దేశాల నుండి ప్రతినిధులు పాల్గొనడం ఆనందంగా ఉంద‌న్నారు మోదీ. వీరిలో 40 మందికి పైగా మంత్రులు కూడా ఉన్నారు. ఇది స్వచ్ఛ ఇంధన పెట్టుబడులు, పారిశ్రామిక అనుసంధానం , సాంకేతిక భాగస్వామ్యాల కోసం ఒక అంతర్జాతీయ వేదికగా నిలవనుంది. ఆస్ట్రేలియా, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్ , యునైటెడ్ కింగ్‌డమ్ వంటి తొమ్మిది దేశాలు/ప్రాంతీయ సమూహాలు ‘కంట్రీ పార్టనర్లు’గా ఈ సదస్సులో భాగస్వాములు కానున్నాయి. అలాగ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ , పశ్చిమ బెంగాల్‌తో సహా 13 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు తమ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను, పెట్టుబడి అవకాశాలను , తయారీ రంగంలో తమకున్న శక్తి సామర్థ్యాలను ఈ సదస్సులో ప్రదర్శించనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *