newsseals.com

తుఫాన్ బాధితలకు అండగా ప్రభుత్వం : అనిత వంగ‌ల‌పూడి

November 4, 2026 · VijayaBhaskar

అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తుపాను బాధితుల‌కు కూట‌మి స‌ర్కార్ త‌ప్ప‌కుండా ఆదుకుంటుంద‌ని పేర్కొన్నారు. బుధ‌వారం స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా స‌మీక్ష చేప‌ట్టారు. వారంలో వచ్చిన రెండు తుఫాన్లను ప్రభుత్వం యంత్రాంగం సమర్ధవంతంగా ఎదుర్కొందని చెప్పారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించ‌డం జ‌రిగింద‌న్నారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశామ‌న్నారు .తుఫాన్ల ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు త్వరితగతిన సహాయం అందించాల‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ముంద‌స్తు చొరవతో వెంటనే కేంద్ర బృందాలను పంపినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.

మురసు తుఫాన్ ముప్పు ఎదుర్కొన్న 7 జిల్లాల్లో 465 గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశామ‌న్నారు అనిత వంగ‌ల‌పూడి. భారీ వర్షాలు, వరదల వేళ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌ల ద్వారా 24 గంటలూ పరిస్థితులను పర్యవేక్షించాలని స్ప‌ష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు చేసిన‌ట్లు తెలిపారు అనిత వంగ‌ల‌పూడి. భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు, రహదారులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని సూచ‌చించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో అర్న‌బ్ తుపానును స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న‌ట్లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో మ‌రోసారి ముర‌సు తుపాను అటాక్ చేసింద‌న్నారు.

Related News