newsseals.com

అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంపై మోదీ ఆరా

November 4, 2026 · VijayaBhaskar

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధ‌వారం ఉదయం ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుఫాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావం ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లిందని సీఎం చెప్పారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని పేర్కొన్నారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తుఫాన్ సహయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. నిరంతర అప్రమత్తతతో తుఫాన్ వల్ల వచ్చిన ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారంటూ సీఎం చంద్రబాబును ప్రధాని ప్రశంసించారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే అర్న‌బ్ తుపాను కార‌ణంగా భారీ ఎత్తున రాష్ట్రంలో ఆస్తి న‌ష్టం సంభ‌వించింద‌ని కేంద్రానికి వెల్ల‌డించారు సీఎం. ఈ సంద‌ర్భంగా దాదాపు రూ. 4,563 కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లింద‌ని రాష్ట్రంలో ప‌ర్య‌టించిన కేంద్ర ప‌రిశీల‌క బృందానికి తెలిపింది ఏపీ కూట‌మి స‌ర్కార్.

Related News