తరుణ్ భాస్కర్.. ఇలాగే అలరిస్తూ ఉండు
హైదరాబాద్ : నటుడు, దర్శకుడిగా తనకంటూ స్వంత ఇమేజ్ కలిగిన తరుణ్ బాస్కర్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సినిమా రంగానికి చెందిన నటీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు. నవంబర్ 5వ తేదీతో తను 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న/దర్శకత్వం వహిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది -2, రవితేజతో చేస్తున్న ‘తులాభారం’ చిత్రాల బృందాలు ఆయన కోసం ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశాయి. టాలీవుడ్లో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు పొందారు. విశ్వక్ సేన్ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది 2 తో పాటు మాస్ మహారాజా రవితేజ చిత్రం ‘తులాభారం’తో తరుణ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాల నిర్మాతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుత ప్రత్యేక పోస్టర్లను విడుదల చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఒక పోస్టర్లో మా దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. వేడుక చేసుకుందాం అని పేర్కొన్నారు.
నవంబర్ 19 నుండి ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE 2) మరోసారి ప్రేక్షకులకు మధుర జ్ఞాపకాలను అందించబోతోంది అని పేర్కొన్నారు. తరుణ్‌కు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ కథ మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుండే కొనసాగుతుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం తరుణ్ ఈ చిత్ర ప్రమోషన్లలో , పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మరోసారి విశ్వక్ సేన్, మాగంటి శ్రీనాథ్, అభినవ్ గోమటం , వెంకటేష్ కాకుమానులతో కూడిన ప్రధాన బృందం స్నేహగాథను ఆవిష్కరిస్తుంది. వారి ప్రయాణంలో ఎదురయ్యే గందరగోళ పరిస్థితులు, కొత్త సాహసాలను మనం ఇందులో చూడవచ్చు. తరుణ్ భాస్కర్ ధాస్యం దర్శకత్వంలో రూపొందుతోంది. మీ వైవిధ్య భరితమైన కథలు , అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను తరుణ్ భాస్కర్ ఇలాగే అలరిస్తూనే ఉండాలని కోరుకుందాం.