newsseals.com

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

November 6, 2026 · VijayaBhaskar

వ‌న‌ప‌ర్తి జిల్లా : తెలంగాణ‌లోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రంగా విల‌సిల్లుతోంది దేవ‌ర‌కద్ర నియోజ‌క‌వ‌ర్గం కౌకుంట్ల మండ‌ల ప‌రిధిలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవాల‌యం. ప్ర‌తి ఏటా బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. న‌వంబ‌ర్ 10వ తేదీ నుంచి శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్బంగా మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యేలు, ఆల‌య క‌మిటీ చైర్మన్, స‌భ్యుల‌తో పాటు ఈవో ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా బ్ర‌హ్మోత్స‌వాల‌కు రావాల్సిందిగా ఆహ్వాన ప‌త్రిక‌ను అందించారు.

ఇక శ్రీ కురుమూర్తి స్వామిని పేదల దేవుడిగా భావిస్తారు. ప్ర‌తి అమ‌వాస్య రోజు వేలాది మంది భ‌క్తులు ఇక్క‌డ ద‌ర్శించుకుంటారు . ఆల‌య చ‌రిత్ర చూస్తే ఘ‌నంగా ఉంది. ఈ ఆలయం సుమారు క్రీ.శ. 1350లో నిర్మించబడినట్లు చ‌రిత్ర చెబుతోంది. మొదట్లో రెండు కొండల మధ్య గుహలో స్వామి వారు దర్శనమిచ్చే వారని స్థానికుల న‌మ్మ‌కం. అనంతరం గుహ స్థానంలో ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం కొండపైకి మెట్ల మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. తిరుమల తిరుపతి మాదిరిగానే కురుమూర్తి క్షేత్రం కూడా ఏడు కొండలతో ప్రసిద్ధి చెందింది. భక్తుల సంప్రదాయంలో ఈ కొండలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. కురుమూర్తి క్షేత్రంలో అత్యంత ప్రత్యేకమైన సంప్రదాయం ఉద్దాల మండపం. ఇక్కడ స్వామివారికి చెప్పులు సమర్పించే ఆచారం ఉంది.

Related News