Sunday, 8 November 2026
Trending

తమ్మిడికుంట చెరువు ప్రారంభానికి సన్నాహాలు

newsseals-HYDRAA

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ మాదాపూర్ లోని తమ్మిడికుంట చెరువు ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఎ . గాంధీతో పాటు ఇతర అధికారులతో కలసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. సభా ప్రాంగణంతో పాటు.. చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. చెరువు పునరుద్ధరణలో భాగంగా అక్కడ సమకూరిన సౌకర్యాలను తిలకించారు. చెరువులోకి STP ల ద్వారా నీటిని తరలించే ఏర్పాట్లను సమీక్షించారు. వర్షం పడితే శిల్పారామం పరిసరాలు నడుం లోతు నీళ్లు నిలబడేవని.. తమ్మిడికుంట చెరువు ఇన్లెట్ల అభివృద్ధితో ఈ ప్రాంతాలకు వరద ముప్పు తప్పిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ చెప్పారు.

కొండాపూర్ పోలీస్ బెటాలియన్ నుంచి పెద్ద మొత్తంలో వచ్చే వరద చెరువుకు చేరేలా చూడాలని సూచించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలను పరిశీలించారు. చెరువు చుట్టూ నిర్మించిన బండ్, పాత్ వేపై నడిచారు. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, హైడ్రా అదనపు కమిషనర్లు ఆర్. సుదర్శన్ , డి. ఆనంద కుమార్ , సైబరాబాద్ జాయింట్ సీపీ సంప్రీత్ సింగ్, ట్రాఫిక్ డీసీపీ రవికుమార్,అడిషనల్ డీసీపీ హనుమంత రావు, ఏసీపీ లు ఉమ మహేశ్వర్ రావు , శ్రీకాంత్ , మాదాపూర్ ఎసిపి చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు ఈ పర్యటనలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *