Sunday, 8 November 2026
Trending

ఒక్క రాత్రికి గ‌డిపేందుకు విజ‌య్ మాల్యా ఆఫ‌ర్

newsseals-PoonamPande

ముంబై : న‌టి పూన‌మ్ పాండే సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ విజయ్ మాల్యా తనతో ఒక రాత్రి గడపడానికి డబ్బు ఆఫర్ చేశారని ఆరోప‌ణ‌లు చేశారు. తాను పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన సమయంలో విజయ్ మాల్యా కంపెనీ నుంచి ‘కింగ్‌ఫిషర్’ ప్రకటన కోసం తనకు ఒక అవకాశం వచ్చిందని పూనమ్ పాండే చెప్పారు. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు త‌న‌ను ఆయన తన ఇంటికి పిలిచార‌ని అన్నారు. ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు, తనతో ఒక రాత్రి గడపమని ఆయన డబ్బు ఆఫర్ చేశారని ఆరోపించారు. దాంతో భయపడి పోయిన తాను ఆ వెంటనే ఆ ప్రతిపాదనను తిరస్కరించి అక్కడి నుంచి పారిపోయాన‌ని తెలిపారు. తాజాగా పూన‌మ్ పాండే చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

బాలీవుడ్ లో న‌టీమ‌ణుల ప‌రిస్తితిని పూన‌మ్ పాండే తెలియ చేసింది. ఇక పూన‌మ్ పాండే గురించి చెప్పాలంటే త‌న స్వ‌స్థ‌లం యూపీ. 11 మార్చి 1991లో పుట్టింది. వృత్తి రీత్యా మోడల్, నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ప్ర‌స్తుతం హిందీ సినిమాల‌లో న‌టిస్తోంది. పూనమ్ పాండే 2010లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. గ్లాడ్ రాగ్స్ మ్యాన్ హంట్ పోటీలో టాప్ 9లో నిలిచి గుర్తింపు పొందారు. ఆ త‌ర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. 2013లో నిషా, 2015లో మాలిని అండ్ కంపెనీ, 2017లో ఆ గ‌యా హీరో, జీఎస్టీ, 2018లో ది జ‌ర్నీ ఆఫ్ కర్మ సినిమాల‌లో న‌టించారు పూనం పాండే. 2011 క్రికెట్ ప్రపంచకప్ సమయంలో భారత జట్టు గెలిస్తే నగ్నంగా కనిపిస్తానంటూ చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *