Monday, 23 November 2026

హైద‌రాబాద్ లో ఘ‌నంగా ప‌ల్స్ పోలియో

newsseals-PriyankaAla

హైద‌రాబాద్ : హైదరాబాద్ జిల్లాలో ‘పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్’లో భాగంగా నిర్వహించిన ‘సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే’ (SNID)లో 94.18% లక్ష్య సాధన నమోదైంది. మొదటి రోజున మొత్తం 5,22,814 మంది పిల్లలకు గాను, 5,11,641 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆసిఫ్ నగర్‌లోని చింతల్ బస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని ప్రత్యేక టీకా కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు, కుటుంబాలతో ప్రయాణిస్తున్న పిల్లలకు టీకా వేసే ప్రక్రియను పర్యవేక్షించారు. బూత్ స్థాయిలో 5,11,641 పిల్ల‌ల‌కు టీకాలు వేసిన‌ట్లు తెలిపారు ప్రియాంక అల‌. 91 అర్బ‌న్ ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ల‌లో ఏర్పాట్లు చేశామ‌న్నారు.

ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన సిబ్బంది, ఉద్యోగుల‌ను అభినందించారు జిల్లా క‌లెక్ట‌ర్ . 2,626 పోలియో బూత్‌లు, 38 ట్రాన్సిట్ పాయింట్లు (ప్రయాణ కేంద్రాలు), 91 మొబైల్ బృందాలు, 5,252 బూత్ బృందాలు ప‌ని చేసిన‌ట్లు తెలిపారు. ఇందులో 10,504 మంది బూత్ బృంద సభ్యులు, 152 మంది ట్రాన్సిట్ బృంద సభ్యులు,182 మంది మొబైల్ బృంద సభ్యులు, 263 మంది పర్యవేక్షకులు పాల్గొన్న‌ట్లు పేర్కొన్నారు క‌లెక్ట‌ర్. ఇంటింటికీ తిరుగుతూ ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మం న‌వంబ‌ర్ 25 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌న్నారు. జిల్లావ్యాప్తంగా 9,26,153 గృహాలను సందర్శించి, బూత్ స్థాయిలో టీకా వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *