Sunday, 22 November 2026

పంచాయతీ ఎన్నికలు సామరస్య పూర్వకంగా జరగాలి

newsseals-PawanKalyan

అమ‌రావ‌తి : జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో కూటమి పక్షాలు సాధించిన అఖండ విజయం స్ఫూర్తిని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. 26వ తేదీన జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు జనసేన శ్రేణులు, నాయకులు సర్వ సన్నద్ధంగా ఉన్నారని ముఖ్య నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జ‌న‌సేనాని దిశా నిర్దేశం చేశారు. కీల‌క సూచ‌న‌లు చేశారు.

రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య స్పూర్తిని క‌లిగించేలా ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని అన్నారు. పార్టీకి చెందిన స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, నేత‌లు, బాధ్య‌త‌లు క‌లిగిన వారంతా ఏమ‌రుపాటుగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స్పూర్తిని కొన‌సాగించాల‌ని, వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించాల‌ని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. ఈ విడతల్లోనూ ఎన్నికలు సామరస్యంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల అనంతరం కూడా గ్రామాల్లో ప్రశాంత పరిస్థితి ఉండే విధంగా ఈ ఎన్నికలు సాగాలని ఆకాంక్షించారు. కూటమి పక్షాల ఐక్యతకు ఈ ఎన్నికలు ఒక నిదర్శనంగా ఉండాలని కోరారు. ఎన్నికల సందర్భంలో శాంతిభద్రతలు పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *