Sunday, 22 November 2026

నా భ‌ర్త‌కు సినిమా ప్ర‌మోష‌న్లు ఇష్టం ఉండ‌దు

newsseals-KeerthySuresh

చెన్నై : ప్ర‌ముఖ న‌టి కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తన భర్త ఆంటోనీ తట్టిల్‌కు సినిమా ప్రమోషన్లు అంటే అస్సలు ఇష్టముండదని మ‌హాన‌టి ఫేమ్ తెలిపారు. ‘సత్యవాన్ సావిత్రి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గురించి వస్తున్న పుకార్లపై ఆమె స్పందించారు. సినీ పరిశ్రమలో నటులతో నాకు సంబంధాలు ఉన్నాయని వచ్చే పుకార్లు నన్ను బాధించేవి. ఎందుకంటే, నేను ఇప్పటి వరకు ఒకే ఒక్క బంధంలో ఉన్నాను, అది కూడా ఆంటోనీతోనే అని పేర్కొన్నారు. ‘దీనిపై నేను స్పందించమంటావా?’ అని ఆంటోనీ అడిగేవారు, కానీ అంతకు మించి ఆయన నన్నెప్పుడూ ఏమీ అడగలేదు. మా ఇద్దరికీ దీనివల్ల ఎలాంటి సమస్య లేనప్పుడు, నేను ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదన్నారు కీర్తి సురేష్‌.

అందుకే నేను అటువంటి పుకార్లను పట్టించుకోను అని ఆమె స్పష్టం చేశారు. తన భర్త ఆంటోనీ చాలా మంచి వ్యక్తి అని, తన కెరీర్‌కు ఆయన ఎంతో అండగా ఉంటారని కీర్తి చెప్పారు. తాను నిరాశకు లోనైనప్పుడు, ఆంటోనీనే తనకు ధైర్యం చెప్పి, ముందుకు సాగేలా ప్రోత్సహిస్తారని ఆమె వెల్లడించారు. సినీ పరిశ్రమకు ఉండే హడావిడి, ప్రమోషన్లు ఆయనకు అస్సలు నచ్చవని, అందుకే ఆయనను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తాను తీసుకువెళ్లనని ఆమె తెలిపారు. సినిమా ప్రీమియర్లకు తాను వెళ్లినప్పుడు కూడా ఆయన రారని, తన పక్కన ఆయన ఉండటం కంటే, ఆయన సౌకర్యమే తనకు ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న కీర్తి, ఆంటోనీలు 2024లో వివాహం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *