Sunday, 22 November 2026

అనిరుధ్ కావ్య మారన్ రిసెప్షన్‌లో నారా లోకేష్

newsseals-Naralokesh

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ టీం సీఈవో కావ్య మారన్ వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు, తనయుడు దేవాన్ష్ హాజరయ్యారు . ఈ సందర్భంగా నారా లోకేష్ దంపతులు నూతన వధూవరులు అనిరుధ్, కావ్య మారన్‌లకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. అనంతరం రిసెప్షన్‌కు విచ్చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లను నారా లోకేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ మంత్రి నారా లోకేష్‌తో ఆప్యాయంగా ముచ్చటించారు

ఇరువురు పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ చిరునవ్వులు చిందించారు. మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌‌తో లోకేష్ కరచాలనం చేశారు. ఈ సంద‌ర్బంగా వారు ఇరువురు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి తిరు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో పాటు మంత్రులు, ఎంపీలు , ప‌లువురు ప్ర‌ముఖులు అనిరుధ్, కావ్య మార‌న్ ల రిసెప్ష‌న్ కు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌కు సినీ, రాజ‌కీయ‌, క్రీడా , వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్బంగా త‌మ సంస్థ‌లో ప‌ని చేసే ఉద్యోగుల‌కు ఏకంగా బంగారు ఉంగ‌రాల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చారు కావ్య మార‌న్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *