Saturday, 21 November 2026

బాల‌య్య‌కు తెలుగు విశ్వ విద్యాల‌యం పుర‌స్కారం..?

newsseals-Balakrisshna

హైద‌రాబాద్ : సుర‌వ‌రం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వ విద్యాల‌యం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు యూనివ‌ర్శిటీ న‌టుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు పుర‌స్కారం అంద‌చేయ‌నున్న‌ట్లు తెలిపింది. వెండితెర సింహం, తన అద్భుత నటనతో లక్షలాది మంది అభిమానులను అలరించడమే కాకుండా, ప్రజా సేవలోనూ తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణ కు మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకోబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి బాలకృష్ణ గారికి త్వరలో ఒక ప్రత్యేక పురస్కారం అందనుందనే వార్త తెలుగు వారందరికీ గర్వ కారణం. కళారంగానికి ఆయన అందించిన సేవలకు , ఆయన అంకితభావానికి ఇది గొప్ప గుర్తింపుగా భావిస్తున్నారు ఆయ‌న అభిమానులు.

ఇదిలా ఉండ‌గా బాల‌కృష్ణ న‌టుడిగా, హోస్ట్ గా గుర్తింపు పొందారు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌పై తిరుగులేని ముద్ర వేసిన న‌ట దిగ్గ‌జం, దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు, నంద‌మూరి బ‌స‌వ తార‌కం ల త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న సోద‌రి నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌స్తుతం హెరిటేజ్ సంస్థ‌లో కీల‌క భాగ‌స్వామిగా ఉన్నారు. అల్లుడు నారా లోకేష్ బాబు ఐటీ, విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. త‌న బావ‌, ఏపీ కూట‌మి స‌ర్కార్ కు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేస్తున్నారు. మ‌రో సోద‌రి బీజేపీ ఎంపీగా కొన‌సాగుతున్నారు. మొత్తంగా బాల‌కృష్ణ‌కు పుర‌స్కారం ద‌క్క‌డం ప‌ట్ల తెలంగాణ వాదులు, మేదావులు , పౌర స‌మాజం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *