Saturday, 21 November 2026

ప‌ట్ట‌ణ మౌలిక స‌దుపాయ‌ల అభివృద్దిపై ఫోక‌స్

newsseals-CM

హైద‌రాబాద్ : రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి పురపాలక పరిపాలన శాఖ సమర్పించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే విధంగా నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చించారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు , ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు, జర్మనీకి చెందిన బ్యాంకు, దేశీయ ఆర్థిక సంస్థల మద్దతుతో సుమారు రూ. 20,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక పరిపాలన శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసిందన్నారు సీఎం.

వరంగల్ నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, వర్షపునీటి పారుదల వ్యవస్థ, వరంగల్ కోట చుట్టూ ఉన్న కందకం పునరుద్ధరణ, హనుమకొండలో కేంద్రీయ వ్యాపార జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆరా తీశారు . మురుగు నీటిని శుద్ధి చేసి, పునర్వినియోగించు కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోందన్నారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలలో, ముఖ్యంగా వస్త్ర పరిశ్రమల పార్కులలో ఉపయోగించడం వల్ల మంచినీటి వనరులపై ఒత్తిడిని తగ్గించవచ్చు అని తెలిపారు. పట్టణ తాగునీటి సరఫరా, నీటి శుద్ధి , పంపిణీ వ్యవస్థలలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి,, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించు కోవడానికి ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుండి 10 నుండి 12 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా సీఎం సమీక్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *