Saturday, 21 November 2026

ఉద్య‌మ‌కారుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాలి

newsseals-Ponnamprabhakar


హైద‌రాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఉద్య‌మ కారుల గుర్తింపు క‌మిటీ. శ‌నివారం హైద‌రాబాద్ లోని .మంత్రుల నివాస సముదాయం ఈ క‌మిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ కె. కేశవరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి , శ్యామ్ మోహన్ హాజరయ్యారు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన ఉద్యమకారులు, కళాకారులు , అట్టడుగు వర్గాల ప్రతినిధులతో ఇప్పటికే జరిపిన సంప్రదింపులు, ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, పని పురోగతిని స‌మీక్షించారు స‌భ్యుల బృందం. గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిం

ఉద్యమకారుల వివరాల నమోదు ప్రస్తుత స్థితిని, అలాగే గుర్తింపు ప్రక్రియ కోసం రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్‌సైట్‌ను పరిశీలించడం జ‌రిగింద‌న్నారు.. ఈ వెబ్‌సైట్ పనులను త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు స‌మావేశం అనంత‌రం రాష్ట్ర బీసీ, సంక్షేమ‌, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌బాక‌ర్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పించడమే త‌మ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కమిటీ తరపున అన్ని విధాలా కృషి చేస్తామ‌న్నారు. వెబ్‌సైట్ రూపకల్పనలో సాధించిన పురోగతిని త్వరలోనే సమీక్షించి, వెబ్‌సైట్ ప్రారంభ తేదీని , తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *