newsseals.com

భ‌క్తుల ఆరాధ్య దైవం శ్రీ స‌త్య‌సాయి బాబా

November 23, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : శ్రీ స‌త్య‌సాయి బాబా జ‌యంతి ఇవాళ‌. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు, మానవతావాది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆయనను ఆరాధిస్తారు. ఆయ‌న అస‌లు పేరు సత్యనారాయణ రాజు. త‌ను 23 నవంబర్ 1926లో ఆంధ‌ప్ర‌దేశ్ లోని అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తిలో జ‌న్మించారు. త‌ల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత, సేవాభావం, పరోపకారం పట్ల ఆసక్తి చూపేవారు. 1940లో తన 14వ ఏట సాయిబాబా తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ప్రకటించారు. అనంతరం దేశ విదేశాల్లో ఆయనకు భక్తులు పెరిగారు. పుట్టపర్తిలో నిర్మించిన ప్రశాంతి నిలయం సత్యసాయి బాబా ఆశ్రమంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 1950 నవంబర్ 23న ఇది ప్రారంభమైంది.

సామాజిక సేవా కార్య‌క్రమాల ద్వారా ఎంతో పేరు పొందారు శ్రీ స‌త్య సాయి బాబా. ఉచిత విద్య‌, వైద్య సేవలు అందించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించారు. ల‌క్ష‌లాది మందికి ఆయ‌న విద్యాదానం చేశారు. విలువ‌లు నేర్పించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. నాణ్య‌మైన వైద్య స‌దుపాయం లేక పోతే ఇబ్బందులు ప‌డతార‌ని ఆయ‌న గ్ర‌హించారు. అందుకే ప్ర‌పంచంలోనే అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు కృషి చేశారు భ‌గ‌వాన్ శ్రీ స‌త్య సాయి బాబా. ఆయ‌న ప్ర‌తి నిత్యం ప్రేమ‌, క‌రుణ‌, ద‌య‌, సేవ గురించి బోధిస్తూ వ‌చ్చారు. క‌ర‌వు కాలంలో శ్రీ స‌త్య‌సాయి బాబా ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో గ్రామాల‌కు తాగునీటి క‌ష్టాల‌ను తీర్చారు. ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు ఎంద‌రికో స్పూర్తిగా నిలిచాయి.

Related News