Sunday, 22 November 2026

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ద్వాదశి ఆస్థానం

newsseals-GovindaRajaSwamy

తిరుప‌తి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పవిత్ర కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కైశిక ద్వాదశి ఆస్థానం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని బంగారువాకిలి చెంత వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద, పురాణ పఠనాల నడుమ కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించి స్వామి వారికి విశేష సేవలు సమర్పించారు.

వైష్ణవ సంప్రదాయంలో కైశిక ద్వాదశికి విశేష ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం, శ్రీ వరాహస్వామి వారు కైశిక పురాణంలోని 82 శ్లోకాలతో కూడిన పవిత్ర కథను శ్రీ భూదేవికి వివరించిన పర్వదినంగా దీనికి విశిష్టత ఉంది. భగవంతునిపై అచంచల భక్తి, శరణాగతి, భక్తి ప్రాధాన్యతను చాటిచెప్పే ఈ పురాణ గాథ ఆధారంగా కైశిక ద్వాదశి వైష్ణవ క్షేత్రాల్లో విశేషంగా ఆచరించ బడుతోంది

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా స్వామి వారి ఆల‌యంలో ద్వాదశి ఆస్థానం కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *