Sunday, 22 November 2026

పారిశుధ్య కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలి

newsseals-SafaiKarmacharisCommissioon

హైద‌రాబాద్ : మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని సమీక్షించింది జాతీయ పారిశుధ్య కార్మికుల కమిషన్. పారిశుధ్య కార్మికులు , పారిశుధ్య కార్మికుల సమస్యలు, సంక్షేమం, పని పరిస్థితులను సమీక్షించేందుకు జాతీయ పారిశుధ్య కార్మికుల కమిషన్ సభ్యులు కరం సింగ్ కర్మా, జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి లతో పాటు సీనియర్ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు , పారిశుధ్య కార్మికులు హాజరయ్యారు. పారిశుధ్య కార్మికులు, శాట్ డ్రైవర్లకు హెల్త్ కార్డులు, పీపీఈ కిట్లు , వైద్య బీమా స‌దుపాయం క‌ల్పించాల‌ని అన్నారు క‌మిష‌న్ స‌భ్యుడు. పీఎఫ్ చెల్లింపులు, కనీస వేతనాలు , సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల‌న్నారు.

పదోన్నతులు, ఖాళీల భర్తీ ,అవుట్‌సోర్స్ నియామకాలపై ఆరా తీశారు. కార్మికుల హాజరు, భర్తీ సేవా సంబంధిత సమస్యలపై చ‌ర్చించారు. రుణ/సబ్సిడీ మద్దతుతో, బీఓటీ (BOT) ప్రజా మరుగుదొడ్ల టెండర్లలో పారిశుధ్య కార్మికులకు రిజర్వేషన్ క‌ల్పించాల‌న్నారు. యాంత్రిక స్వీపింగ్ , ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో ఉపాధి అవకాశాలపై చ‌ర్చించారు క‌మిషన్ స‌భ్యులు. పారిశుధ్య కార్మికుల కాలనీలలో కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, గ్రంథాలయాలు , ఆట పరికరాలతో సహా సంక్షేమ సౌకర్యాలు క‌ల్పించాల‌ని ఆదేశించారు. ఈ ఫిర్యాదులపై స్పందిస్తూ, పారిశుధ్య కార్మికులు/సఫాయి కర్మచారిల జీతాల పెంపు కోసం ప్రభుత్వానికి ఒక అధికారిక ప్రతిపాదనను సమర్పించాలని సభ్యులు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *