కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పై మందుల శామ్యూల్ ఫైర్

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆధిపత్యంలో ఉన్నారని మీరు భావిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. కోమటిరెడ్డి సోదరులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి సోదరులు మా గురించి ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నారు? చేతులు కట్టుకుని కూర్చుంటే వారు గెలవలేదు, మేమే గెలిచాం అన్నారు ఎమ్మెల్యే.

తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో పనితీరు బాగోలేదని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు.. ముందు మునుగోడులో మీ సొంత గందరగోళాన్ని సరిదిద్దుకోండి అంటూ ఎద్దేవా చేశారు మందుల . ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పరిస్థితి మెరుగు పడలేదని నాకు కూడా సమాచారం అందింద‌న్నారు. ముందు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిందేన‌ని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లి రాహుల్ గాంధీని దూషించారు, ఆ తర్వాత ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారని, ఆయ‌న‌కు త‌మ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు.

  • Related Posts

    సోనియా గాంధీ కేసు మెజిస్ట్రేట్ కు అప్ప‌గించిన కోర్టు

    న్యూఢిల్లీ : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసును తిరిగి మేజిస్ట్రేట్‌కు అప్పగించంది ఢిల్లీ కోర్టు. మేజిస్ట్రేట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులో తగిన కారణాలు లేవని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కొత్తగా…

    డీఎస్సీ స్కాంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి

    విజ‌య‌వాడ : డీఎస్సీ స్కాంపై CBI విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని YSRCP డిమాండ్ చేసింది. కుంభకోణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు నిష్పాక్షికమైన విచారణ జరపాలని , ఇందుకు బాధ్య‌త వ‌హిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *