భార‌త్ భ‌ళా శ్రీ‌లంక విల‌విల

59 ప‌రుగుల తేడాతో ఇండియా విన్

గౌహ‌తి : అస్సాంలోని గౌహ‌తి మైదానంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవ‌లే మృతి చెందిన అస్సాం భూమి పుత్రుడు, అమ‌ర గాయ‌కుడు జుబీన్ గార్గ్ కు ఘ‌నంగా నివాళులు అర్పించింది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ). మెగా టోర్న‌మెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ భార‌త మ‌హిళా జ‌ట్టు, శ్రీ‌లంక‌తో త‌ల‌ప‌డింది. మ్యాచ్ కు కొంత వ‌ర్షం కార‌ణంగా అంత‌రాయం ఏర్ప‌డింది. తొలుత టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. ఆదిలోనే స్టార్ ప్లేయ‌ర్ స్మృతీ మంధాన పెవిలియ‌న్ బాట ప‌ట్టింది. ఇదే స‌మ‌యంలో శ్రీ‌లంక బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు ప్లేయ‌ర్ల‌ను. 27 ఓవ‌ర్ల‌లో 6 కీల‌క‌మైన వికెట్ల‌ను కోల్పోయి 126 ర‌న్స్ చేసింది. ఈ త‌రుణంలో దీప్తి శ‌ర్మ‌, కౌర్ క‌లిసి శ్రీ‌లంక బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టించారు.

ఈ ఇద్ద‌రూ క‌లిసి 7వ వికెట్ కు 99 బంతులు ఎదుర్కొని 103 కీల‌క‌మైన ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. దీంతో భార‌త్ భారీ స్కోర్ సాధించింది. 47 ఓవ‌ర్ల‌లో 269 ప‌రుగులు చేసింది. అనంత‌రం 270 ర‌న్స్ భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది శ్రీ‌లంక జ‌ట్టు. 45.4 ఓవ‌ర్ల‌లో 211 ర‌న్స్ కే ప‌రిమ‌త‌మైంది. దీప్తి శ‌ర్మ 53 ర‌న్స్ చేసింది 3 వికెట్లు తీసింది. అమ‌న్ కౌర్ 57 ప‌రుగులు చేసింది. ఒక వికెట్ తీసింది. స్నేహ రాణా 32 ర‌న్స్ ఇచ్చి 2 విక‌ట్లు తీయ‌గా శ్రీ చ‌ర‌ణి 37 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. టోర్న‌మెంట్ లో భాగంగా భార‌త జ‌ట్టు రెండో మ్యాచ్ దాయాది పాకిస్తాన్ తో శ్రీ‌లంక‌తో త‌ల‌ప‌డ‌నుంది.

  • Related Posts

    వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే టి20 ఫార్మాట్…

    జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *