తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం క‌ళా సౌర‌భం

మైమరిపించిన భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుపతి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప‌ట్ట‌ణంలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు రాజమండ్రికి చెందిన డా.పి.సింధూరి వారి బృందం చేసిన “వాగ్గేయకార వైభవం” కూచిపూడి నృత్య ప్రదర్శన సభను భక్తి సాగరంలో ముంచెత్తింది. ఇందులో భాగంగా దశరథ తనయ, జయ జయ జయవర్షిణి అన్న అష్టలక్ష్మి కీర్తన, రామాయణ వైభవం అన్న అంశములపై సాగిన ప్రదర్శన అత్యంత రమణీయంగా, భక్త ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంది.

అన్నమాచార్య కళా మందిరంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీ చదలవాడ సిస్టర్స్ రామ పరిణయం నిత్య రూపకం పుర ప్రజలను విశేషంగా అలరించింది.
శ్రీ కోదండ రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు కాకినాడకు చెందిన పవన్ కుమార్ బృందం సుందరాకాండ తోలు బొమ్మలాట ప్రదర్శించారు. ఉత్స‌వాల‌ను పుర‌స్క రించుకుని దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున క‌ళాకారులు త‌ర‌లి వ‌చ్చారు. త‌మ క‌ళా రూపాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధవుల‌తో అల‌రారుతోంది. గోవింద నామ స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగుతోంది.

  • Related Posts

    అప్పలాయగుంట‌ ఆలయానికి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు’

    తిరుపతి : మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026ను ప్రదానం చేసింది. తిరుపతిలోని తుడా కార్యాలయ ప్రాంగణంలోని కచ్చపి ఆడిటోరియంలో…

    గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవ‌లు అందించాలి

    తిరుమ‌ల : జాతిపిత మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో టీటీడీ ఉద్యోగులు మరింత నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) ప్రభల గోపీనాథ్ కోరారు. స్వచ్ఛత, పరిశుభ్రతకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *