సోషల్ మీడియాలో దుష్ప్ర‌చారం టీటీడీ ఆగ్ర‌హం

తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని టీటీడీ నిర్వ‌హ‌ణ‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల హాస్టల్ లో శాంభవి బ్లాక్ , ప్రణతి బ్లాక్ లలో మరుగుదొడ్లు, స్నానపు గదులు వినియోగించ లేని స్థితిలో ఉన్నాయని సోషియల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నట్లు పెద్ద ఎత్తున ఫోటోలు, ఫేక్ వీడియోల‌తో ప్ర‌చారం చేస్తున్న‌ట్లు త‌మ‌ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ అసత్య ప్రచారాన్ని టీటీడీ పూర్తిగా ఖండిస్తోందని పేర్కొంది.

వాస్తవానికి శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో అభివృద్ధి పనుల్లో భాగంగా స్నానపు గదులను, మరుగుదొడ్లను నిర్మించడం జరుగుతోందని స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు దురుద్దేశ పూర్వకంగా నిర్మాణంలో ఉన్న స్నానపు గదులు, మరుగుదొడ్లను ఫోటోలు తీసి అసత్య ప్రచారం చేయడం శోచనీయం అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. విద్యార్థుల కోసం టీటీడీ విద్యా సంస్థల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోందని స్ప‌ష్టం చేసింది . ఇలా దుష్ప్రచారానికి ఒడిగట్టిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంద‌ని హెచ్చ‌రించింది. సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మకూడదని ఈ సందర్భంగా టీటీడీ కోరింది.

  • Related Posts

    జోగులాంబ స‌న్నిధిలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

    జోగులాంబ గ‌ద్వాల జిల్లా : భార‌త దేశంలో అత్యంత సుప్రిసిద్ద‌మైన శ‌క్తి పీఠంగా విరాజిల్లుతున్న తెలంగ‌దాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఆలంపూర్ లోని జోగులాంబ బాల బ్ర‌హ్మేశ్వ‌ర ఆల‌యాన్ని సోమ‌వారం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్దన్ దంపతులు ఆలంపూర్…

    మీనాక్షి ఆల‌య ప్ర‌సాదం స్వీక‌రించిన సీఎం విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను సోమ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి టీవీకే ర‌మేష్. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ ఆల‌య‌మైన మీనాక్షి సుంద‌రేశ్వ‌ర‌ర్ ఆల‌య ప్ర‌సాదాన్ని సీఎంకు స్వ‌యంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *