అమరావతి : ఏపీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన విజయవంతమైంది. భోగాపురం లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాననాశ్రయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు , గవర్నర్ నజీర్ తో పాటు కేంద్ర , రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సభా వేదిక పైనుంచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్‌ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ – టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు.
కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ప్రారంభించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ పథకాలు స్టార్ట్ అయ్యాయి. కర్నూలు-IV రిన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు, పెంచలకోన – ఏర్పేడు మధ్యనున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లేన్ల బైపాస్ రహదారులు ప్రారంభం అయ్యాయి. దీని వల్ల రాక పోకలకు మరింత సుగమం ఏర్పడుతుంది.






