గుడిలో బ‌ర్త్ డే వేడుక‌లపై టీటీడీ సీరియ‌స్

తిరుప‌తి : తిరుపతి జిల్లాలోని నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చల్లుకుంటూ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడమే కాకుండా ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ తమ సెల్ ఫోన్ తో ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెల్సన్ మండేలా అనే వ్యక్తితో పాటు మరో నలుగురిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది.

సదరు ఘటనా సమయంలో అప్రమత్తంగా లేకుండా ఉన్న టీటీడీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యల కై ఆదేశించడం జరిగిందని తెలిపింది తిరుమల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ). ఆదివారం ఇందుకు సంబంధించి అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్ప‌ష్టం చేసింది. ఇలాంటి వారిపై టీటీడీ చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చ‌రించింది. ఎవ‌రైనా స‌రే టీటీడీ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా ప్ర‌య‌త్నం చేసినా లేదా పోస్టులు పెట్టినా కేసులు న‌మోదు చేస్తామ‌ని పేర్కొంది.

  • Related Posts

    జోగులాంబ స‌న్నిధిలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

    జోగులాంబ గ‌ద్వాల జిల్లా : భార‌త దేశంలో అత్యంత సుప్రిసిద్ద‌మైన శ‌క్తి పీఠంగా విరాజిల్లుతున్న తెలంగ‌దాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఆలంపూర్ లోని జోగులాంబ బాల బ్ర‌హ్మేశ్వ‌ర ఆల‌యాన్ని సోమ‌వారం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్దన్ దంపతులు ఆలంపూర్…

    మీనాక్షి ఆల‌య ప్ర‌సాదం స్వీక‌రించిన సీఎం విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను సోమ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి టీవీకే ర‌మేష్. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ ఆల‌య‌మైన మీనాక్షి సుంద‌రేశ్వ‌ర‌ర్ ఆల‌య ప్ర‌సాదాన్ని సీఎంకు స్వ‌యంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *