శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

తిరుప‌తి : తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి లత ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.అనంతరం చైర్మన్ దంపతులు శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రార్థనలు చేశారు.

అంతకు ముందు ఆలయ ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ వాల్మీకేశ్వర స్వామి, శ్రీ మరగతాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తదనంతరం శ్రీ ప్రదోష నంది మండపం వద్ద ఆలయ సంప్రదాయాల ప్రకారం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య చైర్మన్ దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్, శాంతారాం, పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం

    తిరుప‌తి : తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని మహతి…

    గుడిలో బ‌ర్త్ డే వేడుక‌లపై టీటీడీ సీరియ‌స్

    తిరుప‌తి : తిరుపతి జిల్లాలోని నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చల్లుకుంటూ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడమే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *