విద్యార్థుల‌పై బ‌ల‌ప్ర‌యోగం దారుణం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఝార్ఖండ్ లో శాంతియుతంగా త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం రోడ్డెక్కి నిర‌స‌న తెలియ చేస్తున్న విద్యార్థుల‌పై అత్యంత దారుణంగా బ‌ల ప్ర‌యోగం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ దేశ రాజ‌ధాని ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వం అధికారం ఉంది క‌దా అని దాడుల‌కు పాల్ప‌డితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోర‌ని హెచ్చ‌రించారు. ఎంత కాలం ఇలా వేధింపుల‌కు పాల్ప‌డుతూ, అక్ర‌మ కేసులు బ‌నాయిస్తూ విద్యార్తుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డ‌తారంటూ ప్ర‌శ్నించారు.

సంభాషణతోనే విద్యార్థుల సమస్యలకు పరిష్కారం ల‌భిస్తుంద‌ని, ఆ విష‌యం ఝార్ఖండ్ లో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌ర్కార్ గుర్తిస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు ఎంపీ రాహుల్ గాంధీ. చ‌దువుకునే పిల్ల‌లపై విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్ట‌డం దారుణ‌మ‌న్నారు. ఇది ముమ్మాటికీ త‌ప్పేన‌ని పేర్కొన్నారు. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. వారి సమస్యలకు బలప్రయోగంతో కాకుండా చర్చలు, సంభాషణ ద్వారానే పరిష్కారం లభిస్తుందన్నారు ఎంపీ. ప్ర‌భుత్వం విద్యార్థుల సమస్యలను సానుకూలంగా విని, వారి డిమాండ్లను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Related Posts

    పాద‌చారుల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాలి

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో పాద‌చారుల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాల‌ని సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. ట్రాఫిక్, రహదారి మౌలిక సదుపాయాలు, వర్షాకాల సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కీల‌క మీటింగ్ లో 334 రహదారి మౌలిక…

    పోస్ట‌ల్ ఇన్‌స్పెక్టర్ కౌశిక్ కు కేంద్ర మంత్రి కంగ్రాట్స్

    న్యూఢిల్లీ : కేంద్ర టెలికాం, పోస్ట‌ల్ శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తమిళనాడు సర్కిల్‌లోని బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ ఎస్. కౌశిక్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ను చేసిన ప‌నికి ఇవాళ దేశంలోని కోట్లాది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *