ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపాల్సిందే

స్ప‌ష్టం చేసిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్

అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. హమాస్ శాంతికి సిద్ధంగా ఉందన్నారు. ఇక ఇజ్రాయెల్ త‌క్ష‌ణ‌మే గాజాపై బాంబు దాడులు ఆపాల‌ని స్ప‌ష్టం చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు . హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు ట్రంప్. అంతే కాకుండా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ తన కాల్పుల విరమణ ప్రణాళిక కింద బందీలను విడిపించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దీంతో గాజాపై బాంబు దాడులను ఆపమని ఇజ్రాయెల్‌కు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ప‌ష్టం చేశారు. జనవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ప్రకటన మొదటిసారిగా అమెరికా కీలక మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌ను ఇలా కోర‌డం.

తన బాంబు దాడులను ఆపమని ఆయన స్పష్టంగా కోరారు. ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలి, తద్వారా మనం బందీలను సురక్షితంగా , త్వరగా బయటకు తీసుకు వ‌చ్చేందుకు వీలు కుదురుతుంద‌న్నారు . ఈ విష‌యాన్ని ట్రంప్ త‌న అధికారిక ట్రూత్ సోష‌ల్ ద్వారా పేర్కొన్నారు.
ప్రస్తుతం, అలా చేయడం చాలా ప్రమాదకరం. పరిష్కరించాల్సిన వివరాలపై తాము ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని అన్నారు అమెరికా చీఫ్‌. ఇది గాజా గురించి మాత్రమే కాదు, ఇది మధ్యప్రాచ్యంలో చాలా కాలంగా కోరుకునే శాంతి గురించ అని పేర్కొన్నారు. ఖతార్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ , జోర్డాన్‌లతో సహా US మిత్రదేశాలకు మధ్యవర్తిత్వం వహించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ట్రంప్.

  • Related Posts

    ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ స‌ర్కార్ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు. పేదల తలరాతను…

    భ‌క్త క‌న‌క‌దాస‌ను స్పూర్తిగా తీసుకోవాలి

    పిలుపునిచ్చిన మంత్రి ఎస్. స‌విత‌ తిరుప‌తి : సాధువు, యోగి భ‌క్త క‌న‌క‌దాసును స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. స‌విత‌. తిరుప‌తి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భ‌క్త క‌న‌క‌దాసు విగ్ర‌హాన్ని ఆమె ఆవిష్క‌రించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. రాష్ట్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *