
ఈనెల 11న తమిళనాడులోని కోయంబత్తూరులో స్టార్ట్
చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .
10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ పోటీల్లో 101 కాలేజీల నుంచి 1300 మందికి పైగా యువ ఇంజనీర్ల భాగస్వామ్యం పంచుకోనున్నారు. మరో జాతీయ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరు కావడం విశేషం. ఇదిలా ఉండగా అక్టోబర్ 11న కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరగనున్న 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE – Fraternity of Mechanical and Automotive Engineers) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ కాంపిటీషన్ 2025 ప్రారంభోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని బీఆర్ఎస్ అధికారికంగా వెల్లడించింది.
ఫ్రాటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (FMAE) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలో దేశవ్యాప్తంగా 101 కాలేజీల నుంచి 70కి పైగా విద్యార్థి బృందాలు, మొత్తం 1300 మందికి పైగా యువ ఇంజనీర్లు పాల్గొననున్నారు. విద్యార్థులు తమ స్వయంగా రూపొందించిన వాహనాలు, వినూత్న ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శిస్తారు. ఈ ప్రాజెక్టులను అంతర్జాతీయ స్థాయిలోని అగ్రగామి ఆటోమోటివ్ కంపెనీలకు చెందిన 25 మంది నిపుణుల జ్యూరీ సభ్యులు మూల్యాంకనం చేయనున్నారు. కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో ఎఫ్‌ఎంఏఈ సంస్థ.. ఆయన నాయకత్వాన్ని, మోటార్‌స్పోర్ట్స్ పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు ఫార్ములా-ఈ (Formula-E) రేసింగ్‌ను తీసుకు రావడం ద్వారా తెలంగాణను గ్లోబల్ మోటార్‌స్పోర్ట్ మ్యాప్‌పై నిలబెట్టడంలో కేటీఆర్ పోషించిన పాత్ర అభినందనీయమని కొనియాడింది.