
రీ రిలీజ్ కు రెడీ చేస్తున్న మూవీ నిర్మాతలు
హైదరాబాద్ : దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చర్చనీయాంశంగా మారింది. తను రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో విడుదలై బిగ్ సక్సెస్ అయిన మూవీస్ ను తిరిగి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కీలక అప్ డేట్ వచ్చేసింది ఎస్ఎస్ రాజమౌళి నుంచి. తను ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో కలిపి బిగ్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇదే సమయంలో బాహుబలి మూవీకి సంబంధించి తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డాడు జక్కన్న. ఓ వైపు ప్రిన్స్ మూవీ ఇంకో వైపు బాహుబలి రీ రిలీజ్ కు సంబంధించి ఫైనల్ టచ్ ఇవ్వడం. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. ఫుల్ బిజీగా ఉన్నారు దర్శకుడు.
ఇక మహేష్ బాబుతో తీస్తున్న చిత్రానికి ప్రస్తుతానికి గ్లోబెట్రోటర్ అని పేరు పెట్టాడు. వరల్డ్ వైడ్ గా రూ. 10000 కోట్లు కలెక్షన్స్ సాధించాలని ప్లాన్ చేశాడు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కేమరూన్ తో తను తీయబోయే కొత్త మూవీ ట్రైలర్ , పోస్టర్లను ఆవిష్కరించే పనిలో పడ్డాడు. ఇది గనుక జరిగితే ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ రికార్డ్ గా మిగిలి పోనుంది. నవంబర్‌లో సినిమా ఫస్ట్ లుక్ రివీల్ కోసం మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇంతలో బాహుబలి తన 10వ వార్షికోత్సవాన్ని జరుపు కోవడానికి గొప్ప కొత్త అవతారంలో థియేటర్లలోకి తిరిగి రానుంది. నిర్మాత శోభు యార్లగడ్డ ఇంతకు ముందు ఈ ఐకానిక్ రెండు భాగాల సాగాను బాహుబలి: ది ఎపిక్ అనే సింగిల్, రీకట్ వెర్షన్‌గా ప్రదర్శించనున్నట్లు ధృవీకరించారు. ఈ ప్రత్యేక ఎడిషన్ అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా IMAX, Dolby Cinema, 4DX, DBox , EpiQ వంటి ప్రీమియం ఫార్మాట్‌లలో విడుదల కానుంది.