
నటుడు రాహుల్ రామక్రిష్ణ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ : నటుడు, రచయిత రాహుల్ రామకృష్ణ మరోసారి సంచలనంగా మారాడు. తను తాజాగా ఎక్స్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు కలకలం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. చివరకు రెండు రోజుల పాటు తన ఎక్స్ ఖాతా నుంచి వైదొలిగాడు. పెద్ద ఎత్తున తనను దూషిస్తూ కొందరు పనిగట్టుకుని బూతులతో రెచ్చి పోయారు. ఈ సందర్బంగా తను స్పందించాడు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకంటే గొప్ప వారు సమాజంలో ఉన్నారని, చాలా మంది ప్రముఖలతో తాను సంభాషించానని పేర్కొన్నాడు రాహుల్ రామకృష్ణ. తాను చాలా చిన్నపాటి నటుడిని మాత్రమేనని అన్నారు. చాలా కాలం నుంచి సామాజిక సమస్యలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నాడు. పరిపాలన గురించి తనకు ఏమీ తెలియదని అన్నాడు నటుడు.
ప్రధానంగగా రాజకీయ రంగంలోని అనుభవజ్ఞులైన నాయకులతో అనేకసార్లు ఫోన్ చేశానని తెలిపాడు రాహుల్ రామకృష్ణ. నా ఆందోళన, నిరాశ తప్పు అని తాను గ్రహించానని అని తెలిపారు. వ్యవస్థను ఎవరు ఎలా నడుపుతున్నారో దానితో సంబంధం లేకుండా, మన భూమికి, దాని ప్రజలకు నేను ప్రత్యేకంగా ప్రస్తావించదల్చుకున్నట్లు వెల్లడించారు రాహుల్ రామకృష్ణ. వ్యవస్థతో పాల్గొనడం నా కర్తవ్యం, నన్ను నేను విమర్శలకు పరిమితం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నటుడు. భవిష్యత్తులో నన్ను నేను పూర్తిగా నిమగ్నం చేసుకోగలిగే సమయం వచ్చే వరకు, మనందరినీ పీడిస్తున్న సమస్యలను పరిష్కరించడంలో నాకు ఉన్న చిన్న నైపుణ్యాలు వచ్చే వరకు, నేను ఈ ట్విట్టర్ క్రియాశీలత నుండి నన్ను నేను విరమించుకుంటున్నట్లు తెలిపారు.