బిగ్ బాస్ 10 సీజ‌న్ లో ఇద్ద‌రు ఎలిమినేట్

హైద‌రాబాద్ : బుల్లి తెర రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందింది బిగ్ బాస్ 10 సీజ‌న్. ఈ రియాల్టీ షో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. అంచ‌నాలు పెంచ‌డంలో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ప్ర‌ముఖ న‌టుడు, యాంక‌ర్ అక్కినేని నాగార్జున‌. గ‌తంలో నాని, మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్టీఆర్ లు ఈ షోకు యాంక‌ర్స్ గా వ్య‌వ‌హ‌రించారు. కానీ వారు స‌క్సెస్ కాలేక పోయారు. వీరి ఆధ్వ‌ర్యంలో టీఆర్పీ రేటింగ్స్ ఆశించిన మేర రాలేద‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఇది ప‌క్క‌న పెడితే ఇప్ప‌టికే తెలుగు సినీ రంగంలో మ‌న్మ‌థుడిగా పేరు పొందిన అక్కినేని నాగార్జున త‌న న‌ట‌న అనుభ‌వంతో మ‌రింత ఆద‌ర‌ణ చూర‌గొనేలా చేశారు బిగ్ బాస్ ప్రోగ్రామ్ ను. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 10వ సీజ‌న్ కు చేరుకుంది. దేశంలోనే అత్యంత భారీ ఆద‌ర‌ణ చూర‌గొన్న కార్య‌క్ర‌మంగా ఇది నిలిచింది. దీనికి ప్ర‌ధాన కార‌కుడు నాగార్జున కావ‌డం విశేషం.

ఇది ప‌క్క‌న పెడితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండవ వారంలోకి అడుగు పెట్టడంతో ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మీకు గుర్తుండే ఉంటుంది, గత వారం మధ్యలో జరిగిన ఎవిక్షన్ (eviction) ప్రక్రియలో చరణ్ , చైత్ర బిగ్ బాస్ తెలుగు 10 నుండి ఎలిమినేట్ అయ్యారు. రెండవ వారానికి నామినేట్ అయిన పోటీదారులు: షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, కృష్ణుడు, రాంప్రసాద్, వర్షిణి, సుధీర్, రోహిత్, ముఖేష్ , దేబ్జాని. సృష్టి, వంశీ, నరేష్ , అమన్ సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో 14 మంది పోటీదారులు ఉన్నారు, వీరిలో పది మంది ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. గత వారం సాధారణ ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ జరగలేదు, కానీ తోటి పోటీదారుల ఓట్ల ద్వారా ఇద్దరు పోటీదారులు బయటకు పంపబడ్డారు. ఈ వారాంతంలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్తారో వేచి చూడాలి.

  • Related Posts

    సెప్టెంబ‌ర్ 25 నుండి జీ5లో య‌ష్ టాక్సిక్

    హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో యశ్ కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్ . దీనికి గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ మూవీ. కానీ మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. భారీ…

    బాక్సాఫీస్ వద్ద ‘ఎపిక్’ మ్యాజిక్ తగ్గుముఖం

    హైద‌రాబాద్ : ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి క‌లిసి న‌టించిన చిత్రం ఎపిక్. ఆశించిన మేర వ‌సూళ్లు రాక పోవ‌డం కొంత నిరాశ‌కు గురి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకు పైగా రావాల్సి ఉంది. తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *